హైదరాబాద్: లోక్ సత్తా వ్యవస్ధాపకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ శనివారం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో పర్యటించి ప్రసంగాలు చేశారు. ముషీరాబాద్ లోక్ సత్తా అభ్యర్ధి రోహిత్ తరఫున ఆయన ఎండ ఎక్కక ముందే ప్రచారం చేసి వెళ్ళారు. ప్రజలకు బియ్యం నూనె సబ్సీడీ ధరలకు ఇచ్చి పేదరికాన్ని నిర్మూలించలేమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలకు అందుబాటులో ఉండే అభ్యర్ధులను గెలిపించాలని ఆయన సూచించారు.