కర్ణాటక ఎన్నికలు: ఆదివారం మధ్యాహ్నమే ఫలితాలు
బెంగళూరు: ఎంతో ఉత్కంఠతో ఎదురచూస్తున్న కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఆదివారం నాడు వెలువడనున్నాయి. 224 నియోజక వర్గాలకు జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం రోజు ఉదయం 8గంటలకు ప్రారంభించి, మద్యాహ్నం 3గంటలకల్లా ఫలితాల్ని వెలువరిస్తామని కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి ఎం.ఎన్.విధ్యాశంకర్ అన్నారు. మూడ విడతల్లో జరిగిన ఎన్నికల్లో పోటీచేసిన 1,600 అభ్యర్దుల భవితవ్యం ఆదివారం నాడు తేలనుంది. ఇన్నాళ్ళు రాష్ట్ర పతి పాలనలో ఉన్న కర్ణాటక ప్రజలు తమను పరిపాలించబోయేదెవరనే విషయం ఆదివారమే తెలుసుకొనే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరగడానికి రాష్ట్ర మంతటా గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. వెబ్ సాయంతో హై టెక్ పద్దతిలో ఎన్నికల లెక్కింపు జరపనున్నారు. జాతీయ సమాచార కేంద్ర సాయంతో సాఫ్ఠ్ వేర్ జెనెసిస్ ఇంటర్నెట్ ద్వారా ఓట్ల లెక్కింపును చేపడుతుందని, దేశంలో మెదటి సారిగా అత్యంత తక్కువ సమయంలో ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాల విడుదల చేయబోతున్నామని ప్రధాన ఎన్నికల అధికారి వివరించారు.
రిటర్నింగ్ ఆఫీసర్లు ఫలితాల్ని వెలువరించగానే అవి వెంటనే బెంగుళూరు సమాచార కేంద్రానికి చేరతాయని, రాష్ట్రం లోని 48 లెక్కింపు కేంద్రాలు లోకల్ నెట్ వర్క ద్వారా అనుసంధానం చేయబడ్డాయని, అవన్నీ కలిపి రాష్ట్ర స్దాయి నెట్ వర్క్ కి అనుసంధానం చేశామని, ఫలితాలను లెక్కింపు అదికారులు తెలుసుకోగానే ఏమాత్రం జాప్యం లేకుండా ఆ సమాచారం ప్రజలకు చేరుతుందని ప్రధాన ఎన్నికల అధికారి వివరించారు. 10వేల ఓట్ల లెక్కింపు జరిగి మెదటి రౌండు ఫలితాలు ఉదయం 10:30 కల్లా అందవచ్చని, తుది ఫలితాలు మద్యాహ్నం 3 గంటల కల్లా విడుదలౌతాయని, ఇంకా తమ లోకల్ వెబ్ సైటు www.ceokarnataka.nic.in ద్వారా కూడా ఫలితాలను వెంటనే అందించడానికి కృషి చేస్తూన్నామని శ్రీ విధ్యాశంకర్ అన్నారు.












Click it and Unblock the Notifications
