నిరసనల మధ్య ప్రారంభమైన బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం

ఎయిర్ ఇండియా విమాన కెప్టెన్ ఈశ్వర్ పాల్ మాట్లాడుతూ 'బిఐఎ' నుండి ప్రయాణమయ్యే మొదటి విమానాన్ని తానే నడపడం తన అదృష్టం, ఇది మా అందరికీ గౌరవం. ఒక అంతర్జాతీయ విమానాశ్రయంలో దొరికే అన్ని సౌకర్యాలు బిఐఎ లో అందుబాటులో ఉన్నాయని'' అన్నారు. బిఐఎ సిఇఒ ఆల్బర్ట్ బర్నర్ చాలా ఆనందంగా, రిలాక్స్ డ్ గా కనిపించారు. "చాలా సంవత్సరాలుగా తాను ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నానని, ఇది తన జీవితంలో అత్యంత ఆనందకరమైన రోజని, ఇది బెంగుళూరు వాసులకు గర్వించాల్సిన విషయమని" ఆయన అన్నారు. తమ అసలు పని ఇప్పుడే మొదలైనట్లు గా భావిస్తూ దేశంలోని అన్ని విమానాశ్రయాలకూ ఆదర్శంగా నిలవాలని ఆయన ఆశిస్తున్నారు. బిఐఎ హిందుస్దాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ విమానాశ్రయం విమాన షెడ్యూల్ నే అనుసరిస్తుంది. అర్దరాత్రి కొత్త విమానాశ్రయానికి జరిగిన బదిలీ సవ్యంగా జరిగింది. జ్యూరిచ్ ఇంటర్నైషనల్ ఎయిర్ పోర్ట్స్ లిమిటెడ్, సిమెన్స్, ఎల్&టి, పౌరవిమాన యాన మంత్రిత్వ శాఖ, కర్ణాటక ప్రభుత్వం సంయుక్తంగా ఈ విమానాశ్రయాన్నినిర్మించగా కర్ణాటకకు ఇందులో 26% భాగస్వామ్యం ఉంది.












Click it and Unblock the Notifications
