డబ్బులతో చిక్కిన కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్: హైదరాబాదులోని ముషీరాబాద్ శాసనసభా నియోజకవర్గంలో డబ్బులు పంచుతూ కాంగ్రెస్ నాయకులు బుధవారం పట్టు పడ్డారు. మంత్రి ముఖేష్ బంధువులే డబ్బులు పంచారని ఆరోపిస్తూ సిపిఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోటీగా కాంగ్రెసు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సిపిఎం నాయకులు మహిళలపై దౌర్జన్యం చేశారంటూ కాంగ్రెసు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సిపిఎంకు మద్దతుగా వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు చేయి చేసుకున్నారు.
మంత్రి ముఖేష్ వియ్యంకుడు డబ్బులు పంచుతున్నాడని సిపిఎం నాయకులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన రుజువులను కూడా సంపాదించారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. ముషిరాబాదు నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బిజెపి అభ్యర్థి కె. లక్ష్మణ్ ఇక్కడికి చేరుకున్నారు. డబ్బులు పంపింది మంత్రి ముఖేష్ అని సిపిఎం ఆరోపిస్తోంది.












Click it and Unblock the Notifications
