ఏపీ మీదుగా చెన్నైకి ప్రత్యేక రైళ్లు- హాల్ట్ స్టేషన్లు

పండగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. దసరా, దీపావళి, ఛత్ పూజ వేళ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి వివిధ గమ్యస్థానాల మధ్య నడిచే వీక్లీ స్పెషల్ రైళ్లను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు అక్టోబర్ నుండి నవంబర్ వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ప్రత్యేక రైళ్లనూ అందుబాటులోకి తెచ్చారు.

ఈ క్రమంలో హైదరాబాద్- కొల్లం మధ్య నడిచే ప్రత్యేక రైలును నవంబర్ చివరివారం వరకూ పొడిగించారు. నిజానికి ఈ రైలు అక్టోబర్ మొదటివారంలో ముగియాల్సి ఉంది. అలాగే.. జోధ్‌పూర్ నుంచి చెన్నై బీచ్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టారు. అక్టోబర్ 3వ తేదీన పట్టాలెక్కుతుంది. శబరిమల సీజన్ ప్రారంభమయ్యే సమయంలో కొల్లం మార్గంలో అదనపు సర్వీసులు కేరళ వెళ్లే అయ్యప్ప భక్తులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

Railways Plans Special Trains From Jodhpur to Chennai to Beat Festival Season clear extra passanger rush
  • అక్టోబర్ 3, 10, 17, 24, 31, నవంబర్ 7, 14, 21, 28 తేదీల్లో ప్రతి శనివారం రాత్రి 11:10 నిమిషాలకు హైదరాబాద్ నుంచి కొల్లం బయలుదేరే నంబర్ 07193 ప్రత్యేక రైలు మూడో రోజు ఉదయం 7: 10 నిమిషాలకు కొల్లం చేరుకుంటుంది.
  • అక్టోబర్ 5, 12, 19, 26, నవంబర్ 2, 9, 16, 23, 30 తేదీల్లో ప్రతి సోమవారం ఉదయం 10:45 నిమిషాలకు కొల్లం నుంచి బయలుదేరే నంబర్ 07194 ప్రత్యేక రైలు మరుసటి రోజు సాయంత్రం 5: 30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
  • సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలార్ పేట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొదనూర్, పాలక్కాడ్, త్రిశూర్, ఆలువ, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చంగనస్సేరి, తిరువళ్ల, చెంగన్నూర్, మావెలిక్కార, కాయంకుళం, కరుణాగపల్లి, సస్థాన్ కోట మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.

జోధ్‌పూర్- చెన్నై బీచ్ ప్రత్యేక రైలు..

  • అక్టోబర్ 3, 10, 17, 24, 31, నవంబర్ 7, 14, 21, 28 తేదీల్లో ప్రతి శనివారం రాత్రి 9:20 నిమిషాలకు జోధ్ పూర్ నుంచి బయలుదేరే నంబర్ 04815 ప్రత్యేక ఎక్స్ ప్రెస్.. మూడో రోజు రాత్రి 8 గంటలకు చెన్నై బీచ్ స్టేషన్ కు చేరుకుంటుంది.
  • అక్టోబర్ 6 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు ప్రతి మంగళవారం సాయంత్రం 5: 15 నిమిషాలకు డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరే నంబర్ నంబర్ 04816 ఎక్స్ ప్రెస్ మూడో రోజు రాత్రి 8:30 గంటలకు జోధ్ పూర్ కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు చెన్నై బీచ్ నుంచి కాకుండా చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరుతుంది.
  • మెర్తా రోడ్, డెగానా, మర్ఖానా, కుచామన్ సిటీ, ఫులేరా, జైపూర్, దుర్గాపూర్, సవాయ్ మాధోపూర్, సొగారియా, బారన్, ఛబ్రా గుగోర్, రుథ్యాల్, గుణ, బీణా, భోపాల్, ఇటార్సీ, నాగౌర్, బల్లార్షా, సిర్పూర్ కాగజ్ నగర్, మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, విజయవాడ, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+