ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠాపనకు బ్రేక్
హైదరాబాద్: హైదరాబాదు సమీపంలోని వనస్థలిపురం పనామా గోడౌన్స్ చౌరస్తాలో స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహ ప్రతిష్ఠాపనను పోలీసులు బుధవారంనాడు అడ్డుకున్నారు. మున్సిపాలిటీ అనుమతి లేదంటూ పోలీసులు అభ్యంతర పెట్టారు. ఎన్టీరామారావు విగ్రహ ప్రతిష్ఠాపనకు కాంగ్రెసు కార్యకర్తలు మొదట అభ్యంతరపెట్టారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఆ పరిస్థితిలో పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠాపనను అడ్డుకున్నారు. విగ్రహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీరామారావు జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విగ్రహ ప్రతిష్ఠాపనకు పూనుకున్నారు.












Click it and Unblock the Notifications
