విజయరామారావు అరెస్టు, విడుదల
హైదరాబాద్: వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి విజయరామారావును పోలీసులు అరెస్టు చేసి విడుదల చేశారు. కాంగ్రెసు పార్టీవారు నమూనా బ్యాలెట్ పేపర్లు ముద్రించి పంచుతున్నారని ఆరోపిస్తూ ఆయన ధర్మసాగర్ ఓ పోలింగ్ బూత్ కు అడ్డంగా పడుకుని ధర్నాకు దిగారు. పోలింగును అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. దీంతో తెరాస కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అనంతరం ఆయనను పోలీసులు విడుదల చేశారు.
ఆ తర్వాత కూడా విజయరామారావు ధర్నాను కొనసాగిస్తున్నారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆయన ధర్నాకు దిగారు. కాంగ్రెస్ అక్రమాలను అడ్డుకుంటామని విజయరామారావు చెప్పారు. హస్తం గుర్తులు ఉన్న పోలింగ్ చీటీలను కాంగ్రెస్ వారు పంచుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications