అభివృద్ధే ఎజెండా: ముఖ్యమంత్రి

YS Rajasekhar Reddy
హైదరాబాద్: అభివృద్ధి మంత్రమే తమ ఎజెండా అని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. ఉప ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు మల్లు రవి, ప్రసాద్, విష్ణువర్ధన్ రెడ్డి సోమవారం ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండూరు, చేవెళ్ల తదితర ప్రాంతాలకు గోదావరి జలాలను అందిస్తామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ప్రజలకు శాశ్వత ప్రయోజనాలు చేకూర్చడమే తమ ఉద్దేశమని ఆయన అన్నారు.

ఉప ఎన్నికల్లో తమను గెలిపించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేట్లు పని చేయాలని ఆయన సూచించారు. పార్టీ అభ్యర్థులను కష్టపడి గెలిపించారని ఆయన పార్టీ కార్యకర్తలను అభినందించారు. తెలంగాణ ఉప ఎన్నికల్లో ఓడిన స్థానాల్లో పరిస్థితిపై ఆయన విశ్లేషణ జరిపారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ స్థానాల నుంచి నివేదికలు పంపాల్సిందిగా ఆయన ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+