లోయలో పడ్డ బస్సు: ముగ్గురు మృతి
నెల్లూరు: నెల్లూరు జిల్లా రాపూరు, చిట్వేల్ ఘాట్ రోడ్డుపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరో 60 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో 20 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కడప నుంచి వాకాడు బయలు దేరిన బస్సు సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో చిట్వెల్ ఘాట్ రోడ్డు వద్ద ప్రమాదవశాత్తు 50 అడుగుల లోతు గల లోయలో పడిపోయింది.
గాయపడినవారిలో కొంత మందిని వెంకటగిరి ఆస్పత్రికి తరలించారు. మరికొంత మందిని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. లోయలో పడిన బస్సును బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications