పెట్రో ధరల పెంపుపై ఆందోళన: దత్తాత్రేయ

Bandaru Dattatreya
హైదరాబాద్: పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రాధ్యక్షుడు బండార దత్తాత్రేయ చెప్పారు. రేపు జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేయనున్నట్లు ఆయన బుధవారం తెలిపారు. పెట్రోల్ ధరను లీటరుకు 5 రూపాయలు, డీజిల్ ధరను లీటరుకు 3 రూపాయలు, వంటగ్యాస్ ధరను సిలిండర్ కు 50 రూపాయలు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పెరిగిన ధరలు ఈ అర్థరాత్రి నుంచే అమలులోకి వస్తాయి. ఈ ధరల పెంపుపై భవిష్యత్తులో మండల స్థాయిల్లో ఆందోళనకు దిగుతామని బండారు దత్తాత్రేయ చెప్పారు.

కేంద్ర ఫ్రభుత్వ అసమర్థత వల్ల ధరలు పెరిగాయని ఆయన విమర్శించారు. కేంద్ర ఆర్థిక విధానాల లోపం కూడా ధరల పెరుగుదలకు కారణమని ఆయన అన్నారు. సామాన్యులపై, రైతులపై ఈ ధరల పెరుగుదల భారం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రయాణ ఛార్జీలు కూడా పెరిగి ప్రజలు ఇబ్బందులకు గురవుతారని ఆయన అన్నారు. వంటగ్యాస్ ధర పెంపు వల్ల మహిళా లోకంపై భారం పడుతుందని, ఇప్పటికే గ్యాస్ కొరతతో బాధ పడుతున్నారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+