దీవుల్లో 182 మంది హెచ్ఐవి బాధితులు
పోర్ట్ బ్లెయర్:అండమాన్ నికోబార్ ద్వీపసమూహంలో మెత్తం182 మంది హెచ్.ఐ.వి. పాజిటివ్ బాధితులను కనుగొనడం జరిగింది. గత సంవత్సరం తో పోలిస్తే ఈ ఏడాది ఈ సంఖ్య కాస్త ఎక్కువ.''182 మంది హెచ్.ఐ.వి. పాజిటివ్ బాధితుల్లో 152 మంది అండమాన్ జిల్లా వారు, మిగతా 30మంది ఆదిమ జాతివారు అధికంగా ఉండే నికోబార్ గ్రూపు వారు. వీరే కాకుండా ఇంకా అక్రమంగా అండమాన్ లో ఉంటూ కోస్ట్ గార్టు పోలీసులకు పట్టుబడి ప్రస్తుతం జైల్లో ఉన్నవిదేశీయుల్లో 170 మంది కూడా హెచ్.ఐ.వి.పాజిటివ్ బాధితులు ఉన్నారని'' అండమాన్ నికోబార్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (అనాక్స్-ANACS) ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ మిశ్రి లాల్ విలేకర్లతో చెప్పారు. నికోబార్ లో 30మంది హెచ్.ఐ.వి. పాజిటివ్ బాధితులు ఉండటం తీవ్రంగా పరిగణించాల్సిన విషయం ఎందుకంటే వారు హెచ్.ఐ.వి./ఎయిడ్స్ గూర్చి ఏమాత్రం అవగాహన లేని ఆదిమ జాతి వారు. అలాంటి చోట ఎక్కువ మంది హెచ్.ఐ.వి. బారిన పడే ప్రమాదం ఉంది. 'ఒక్క ఎయిడ్స్ రోగి కారణంగా ఒక దశాబ్ద కాలంలో మొత్తం ప్రజలంతా అంతరించే ప్రమాదం ఉందని'' అండమాన్ లోని ఒక ట్రైబల్ యాక్టివిస్ట్ హెచ్చరించారు.ఈ విషయంలో నారిక ప్రపంచానికి దూరంగా ఉండే వీరికి ఎయిడ్స్ గురించి అవగాహన పెంపొందిచడానికి 'అనాక్స్' చాలా వర్క్ షాపుల్ని నిర్వహించి వారికి అవగాహణ పెంపొందిచడానికి కృషి చేస్తుంది. రవాణా సౌకర్యాలు ఏమాత్రం లేని అండమాన్ ప్రాంతాల్లో హెచ్.ఐ.వి./ఎయిడ్స్ పెద్ద ముప్పుగా పరిణమిస్తుంది. దాన్ని నివారించడానికి కేంద్రం కొన్ని ప్రత్యేక వ్యూహాల ద్వారా ప్రయత్నించాలని నిపుణుల అభిప్రాయం.












Click it and Unblock the Notifications