పెట్రో ఉత్పత్తులపై కాసు మాట

హైదరాబాద్: పెట్రో ఉత్పత్తుల ధరల పెంపుపై రాష్ట్ర మంత్రులు కాసు వెంకటకృష్ణారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య ఆచితూచి మాట్లాడారు. ధరల పెంపుపై తాము ఏమీ చేయలేమని వారు మీడియా ప్రతినిధులతో అన్నారు. ధరల పెంపు వివరాలు కేంద్రం నుంచి తమకు అందిన తర్వాత మట్లాడుతామని కాసు వెంకటకృష్ణారెడ్డి అన్నారు. ధరల పెంపు ఎవరికీ ఆమోద యోగ్యం కాదని, కానీ ఏ పరిస్థితుల్లో పెంచారో తెలియాల్సి ఉందని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కూడా ధరల పెంపును వ్యతిరేకిస్తారని, ధరలు పెంచకూడదనేదే అందరి అభిప్రాయమని ఆయన అన్నారు. పెట్రో ఉత్పత్తుల ధరల పెంపు వల్ల ఇబ్బందేనని ఆయన అంగీకరించారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపు వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+