హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్ధానాలకు అభ్యర్ధులను లోక్ సత్తా నిర్ధారించుకుంది. రెండు రోజులుగా ఇక్కడ జరిగిన ఆ పార్టీ కార్యవర్గ సమావేశంలో వివరాలను సంస్ధాగత వ్యవహారాల ఇన్ చార్జి బండారు రామ్మోహనరావు విలేకరులకు చెప్పారు.ఉప ఎన్నికల్లో మద్యం, మనీ పంచక పోయినా లోక్ సత్తా తన సత్తా చాటుకుందని ఆయన్ అన్నారు. అయితే ప్రజల నుండి లభించిన ఆదరణని ఓట్ల రూపంలోకి మార్చుకోలేక పోయామని ఆయన తెలిపారు. మద్యంపై ప్రభుత్వ నిర్ణయం వెలువడిన వెంటనే ఉద్యమాన్ని చేపట్టే విషయాన్ని పరిశీలిస్తామని ఆయన్ చెప్పారు.