'చిరు' కోసం డల్లాస్ లో 'ప్రవాసవారధి' సమావేశం

Chiranjeevi
హైదరాబాద్: ప్రవాస చిరంజీవి ఆర్గనైజేషన్- 'ప్రవాస వారధి' రెండవ అంతర్జాతీయ స్పార్క్ సమావేశం టెక్సాస్ లోని డల్లాస్ లో జరిగింది. (సిఎఎన్ఎ) చిరంజీవి అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా సహకారంతో మే 31న జరిగిన ఈ సమావేశానికి ఎన్నారైల నుండి అధ్బుతమైన ప్రతిస్పందన వచ్చిందని నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నాలుగు వందలకు పైగా ప్రవాసాంధ్ర పారిశ్రామిక వేత్తలు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఐటి ఉధ్యోగులు, లాయర్లు డాక్టర్ చిరంజీవికి మధ్దతుగా 'ఫన్ ఏసియా థియేటర్' లో సమావేశమయ్యారు. తన లైవ్ వీడియో, టెలి కాన్ఫరెన్స్ సంభాషణలో డా. చిరంజీవికి మధ్దతుగా ప్రపంచవ్యాప్త ప్రజలను, వివిధ సంఘాల్ని ఏకం చేస్తున్న'ప్రవాస చిరంజీవి ఆర్గనైజేషన్' కృషిని శ్రీ నాగేంద్రబాబు ప్రశంసించారు. అన్ని సామాజిక వర్గాలనుండి డా. చిరంజీవికి, ఆంధ్ర ప్రధేశ్ ప్రజల అవసరాలను తీర్చడానికి 'చిరంజీవి చారిటబుల్ ట్రస్టు'కు వస్తున్న మద్దతును మెగా సోదరుడు శ్రీ నాగేంద్రబాబు ఈ సందర్బంగా గుర్తుచేసారు. ఆంధ్ర ప్రధేశ్ అభివృద్ది గురించి డా. చిరంజీవి పై ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి ఆయన న్యాయం చేకూరుస్తారని శ్రీ నాగేంద్రబాబు హామీ ఇచ్చారు. మాతృభూమి అభివృద్దిలో ఎన్నారైల ప్రాముఖ్యతను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్టు కు పెద్ద ఎత్తున సహాయం అవసరం అని, 'చిరు రైలు' ఎంతో దూరంలో లేదని ఆయన ఈ సందర్బంగా హామీ ఇచ్చారు.

తిరుపతి నుండి శ్రీకాకుళం వరకు జరిగిన ఎన్నారై మహా యాత్ర విశేషాలను గూర్చి, వెళ్ళిన ప్రతిచోట ఆ యాత్రకు ఆంధ్రప్రధేశ్ ప్రజలనుండి లభించిన అధ్బుతమైన ప్రతిస్పందన గూర్చిప్రవాస చిరంజీవి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు శ్రీ నరసయ్య వడ్రానం వివరించారు. చిరంజీవికి మద్దతు కూడగట్టడానికి దేశమంతటా 22 ప్రాంతాల్లో ప్రవాస చిరంజీవి ఆర్గనైజేషన్ నిర్వహించిన సభలను గూర్చి, చిరంజీవి ఉన్నతవ్యక్తిత్వం, సేవాస్వభావం, ఆంధ్ర ప్రధేశ్ కి ఆయన నాయకత్వం అవసరం గూర్చి ఆయన వివరించారు. మెరుగైన ఆంధ్ర ప్రధేశ్ కోసం "చేంజ్-హోప్" (మార్పు-నమ్మకం) తమ నినాదం అని ఆయన చెప్పారు. గ్రామీణాభివృద్ది, విధ్య, ఆరోగ్య భద్రత ఆవశ్యకతను, జాతిపిత మహాత్మాగాంధీ ఆదర్శాలను ప్రతిబింభించిన శంకర్ దాదా జిందాబాద్ సినిమా ప్రదర్శన ప్రత్యేక ఆకర్షనైంది. గౌరవ ముఖ్య అతిధి, ఒంగోలు స్వస్ధలమైన ఎన్నారై శ్రీ పవన్ కుమార్ దాసరి ఈ సందర్బంగా మాట్లాడుతూ చిరంజీవి వ్యక్తిత్వాన్ని, సేవాభావాన్ని ప్రశంసిస్తూ చిరంజీవి నాయకత్వంలో అభివృద్దిని సాధిస్తామని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 'కానా' సభ్యుడు శ్రీనివాస్ రావుల మాట్లాడుతూ చిరంజీవి పతనమవుతున్న రాజకీయాల్ని ప్రక్షాళనం చేస్తారని అన్నారు. మరో వక్త శ్రీ సత్య వాసంశెట్టి చిరంజీవి నిస్పక్షపాతి అని, ఆయన ప్రాంతీయ, మత పక్షపాతాలు లేనివాడని, ఆయన బలహీన వర్గాల అభివృద్ది పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తారని అన్నారు. డాక్టర్ అర్చన మాట్లాడుతూ మహిళలకు ఆర్దిక స్వాతంత్ర్యం, మహిళా రిజర్వేషన్లు, మారుమూల ప్రాంతాల్లో ఆరోగ్య భధ్రత చైతన్యం, వైధ్య సదుపాయాల ఆవశ్యకత ఎంతో ఉందని అభిప్రాయపడ్డారు.

డాక్టర్ పుప్పాల ఆనంద్, డాక్టర్ దయాకర్, శ్రీ బాల్ కిషోర్, చిల్లకూరు గోపి రెడ్డి ఆంధ్ర ప్రధేశ్ అభివృద్దిలో ఎన్నారైల భాగస్వామ్యం గూర్చి వివరించి, చిరంజీవి రాజకీయాల్లోకి రావాలనే అభిలాషను వ్యక్తం చేశారు. ప్రవాస వారధి రెండవ అంతర్జాతీయ స్పార్క్ సమావేశాన్ని విజయవంతం చేయడంలో ప్రవాస వారధి సభ్యులు శ్రీ సురేష్ లింగనేని, శ్రీ శ్రీనివాస్ భావిరెడ్డి, శ్రీ బస్వి రెడ్డి ఇయులూరి ల కృషికి ప్రవాస చిరంజీవి ఆర్గనైజేషన్ ఉపాధ్యక్షుడు, అధికారిక వక్త శ్రీ మనప్రగడ శ్రీనివాస్, సలహాదారుడు శ్రీ శివకుమార్ అర్జా, జనరల్ సెక్రటరి శ్రీ శేఖర్ సెర్రా, మధ్య ప్రాచ్య ప్రాంతీయ ఉపాధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ లొట్టల, నైరుతి ప్రాంత ఉపాధ్యక్షుడు కళ్యాణ్ పల్లా, నైరుతీ ప్రాంత ఉపాధ్యక్షుడు శ్రీ శివ కొండపల్లి, మహిళా కార్యదర్శి సమతా తుమ్మల, పబ్లిక్ రిలేషన్స్ ఇన్చార్జ్ శ్రీకాంత్ పలివెల కృతఙ్ఞతలు తెలిపారు. తమ మూడవ అంతర్జాతీయ స్పార్క్ సమావేశం న్యూజెర్సి లోని ఫోర్డ్ లో 2008 జూన్ 8 ఆదివారం రోజు , నాల్గవ అంతర్జాతీయ స్పార్క్ సమావేశం అట్లాంటా లో 2008 జూన్ 14 ఆదివారం నాడు, ఐదవ స్పార్క్ అంతర్జాతీయ సమావేశం కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ లో 2008 జూన్ 28 శనివారం రోజు నిర్వహించనున్నామని, ఆతరువాత జరిగే సమావేశాల్ని కెనడాలోని టోరంటోలో, యునైటెడ్ కింగ్ డమ్ లోని లండన్ లో ఆస్ట్రేలియాలోని క్వీన్స్ బరి లో నిర్వహించనున్నారని సమాచారం. www.pravasachiranjeevi.org లో ప్రవాస వారధి గూర్చి సమాచారం లభ్యమౌతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+