పెట్రో ధరలపై భగ్గుమన్న టిడిపి

హైదరాబాద్: పెట్రో ధరల పెరుగుదలపై రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపడతామని తెలుగుదేశం పార్టీ నాయకుడు టి. దేవేందర్ గౌడ్ చెప్పారు. పెట్రో ధరలు పెంచబోమని ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఆ హామీని విస్మరించి ఇప్పటి వరకు ఏడుసార్లు ధరలు పెంచిందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఇప్పటికే అన్ని సరుకుల ధరలు పెరిగాయని, పెట్రో ఉత్పత్తుల ధరల పెంపు వల్ల ఆ ధరలు మరింతగా పెరుగుతాయని ఆయన అన్నారు. ఒక వైపు ధరలను అదుపు చేయకపోగా మరో వైపు పన్నులు పెంచి ప్రభుత్వం ఖజానా నింపుకుంటోందని ఆయన అన్నారు.

పెట్రో ధరల పెంపుపై సిపిఎం కార్యదర్శి బి.వి. రాఘవులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగతా పార్టీలతో కలిసి ఆందోళన చేపడతామని ఆయన అన్నారు. వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపడతామని, అప్పటికి కూడా ప్రభుత్వం దిగి రాకపోతే ప్రభుత్వం ఉంటుందో, పోతుందో తేల్చుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. సామాన్యునిపై ధరల పెంపు ప్రభావం విపరీతంగా ఉంటుందని ఆయన చెప్పారు. సామాన్యుల జీవితాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+