గోడ కూలి 4గురు కూలీల మృతి
హైదరాబాద్: హైదరాబాద్ జూబిలీహిల్స్ లోని అన్నపూర్ణ స్టూడియో సమీపంలో గోడ కూలడంతో నలుగురు మరణించారు. ఈ విషాద సంఘటన బుధవారం ఉదయం తొమ్మిది, పది గంటల ప్రాంతంలో జరిగింది. మృతులందరూ నల్లగొండ జిల్లాకు చెందినవారని తెలుస్తోంది. హ్యాపీ హోమ్స్ అనే అపార్ట్ మెంటు పనుల కోసం 12 మంది కూలీలను నియోగించారు. తవ్వకాలు ప్రారంభించిన సమయంలో ప్రహరీ గోడ పునాదులు కదిలి గోడ కూలింది.
గొడ శిథిలాల కింద 8 మంది కూలీలు చిక్కుకుపోయారు. వారిలో ఐదుగురిని ప్రాణాలతో బయటకు తీశారు. ముగ్గురు అక్కడికక్కడ మరణించారు. మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. గాయపడినవారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. మంత్రులు షబ్బీర్ అలీ, ముఖేష్ గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఖైరతాబాద్ శాసనసభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా అక్కడి చేరుకున్నారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications