తీవ్ర నిర్ణయం తీసుకుంటాం: సిపిఎం
నెల్లూరు: పెట్రో ఉత్పత్తుల ధరలను తగ్గించకపోతే రాజకీయ పొత్తుల విషయంలో పునరాలోచన చేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. పెట్రో ఉత్పత్తులు ధరల పెంపును నిరసిస్తూ తెలుగుదేశం, సిపిఐలతో కలిసి సిపిఎం శుక్రవారం ప్రదర్శన నిర్వహించింది. ఈ ప్రదర్శనలో రాఘవులు పాల్గొన్నారు. వారం రోజుల్లో పెట్రో ఉత్పత్తుల ధరలను తగ్గించాలని, లేకుంటే తీవ్ర రాజకీయ నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.
వంటగ్యాస్ ధరను తగ్గిస్తున్నట్లు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన హామీ ఆచరణకు నోచుకునేది కాదని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ పాలనాపరమైంది కాదని ఆయన అన్నారు. పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచిన ప్రభుత్వానికి నూకలు చెల్లాయని, దాన్ని కొనసాగించాల్సిన బాధ్యత తమకు లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications