మహారాష్ట్రలో హైదరాబాదీల మృతి
హైదరాబాద్: మహారాష్ట్రలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాదుకు చెందిన 8 మంది మరణించారు. మరో 7గురు గాయపడ్డారు. అజ్మీర్ దర్గాను సందర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. మృతులు హైదరాబాదులోని గోషామహల్ ప్రాంతానికి చెందినవారు.
అజ్మీర్ దర్గా నుంచి వస్తున్న వీరి క్వాలిస్ వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం మహారాష్ట్రలోని షోలాపూర్ సమీపంలో జరిగింది. మృతుల శవాల కోసం హైదరాబాదులోని వారి బంధువులు ఎదురు చూస్తున్నారు.












Click it and Unblock the Notifications