అమ్మకం పన్ను తగ్గించం: రోశయ్య

Rosaiah
హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ లపై అమ్మకం పన్ను తగ్గించే ప్రసక్తి లేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి కె. రోశయ్య స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ అమ్మకం పన్ను ద్వారా వచ్చే ఆదాయాన్ని వంట గ్యాస్ సబ్సిడీకి మళ్లిస్తామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఇది వరకు అమ్మకం పన్ను పలు సార్లు తగ్గించామని, దీని వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గిందని ఆయన చెప్పారు. అమ్మకం పన్ను తగ్గిస్తే ప్రభుత్వ ఆదాయం తగ్గి అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన చెప్పారు.

పెట్రో ఉత్పత్తుల ధరల పెంపు వల్ల రాష్ట్రానికి కొంత ఆదాయం సమకూరే మాట వాస్తవమేనని, అయితే వంటగ్యాస్ కు 50 రూపాయల సబ్సిడీ ప్రకటించామని, పెట్రోల్, డీజిల్ అమ్మకం పన్ను నుంచి వచ్చే వచ్చే మొత్తాన్ని గ్యాస్ సబ్సిడీకి తరలిస్తామని ఆయన వివరించారు. వంటగ్యాస్ పై ప్రకటించిన సబ్సిడీ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై 300 నుంచి 325 కోట్ల రూపాయల వరకు పడుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణంగానే పెట్రోల్, డీజిల్ లపై అమ్మకం పన్ను తగ్గించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+