ఆర్టీసి చార్జీల పెంపు తక్కువే: వైయస్

YS Rajasekhar Reddy
గుంటూరు: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసి) బస్సు చార్జీలు సాధ్యమైనంత తక్కువ పెంచేలా చూస్తానని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వల్ల నిత్యావసర సరుకుల ధరలు పెరగకుండా చూస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. గ్యాస్ పై తాము ప్రకటించిన 50 రూపాయల సబ్సిడీ విధివిధానాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మూడు చమురు కంపెనీలతో చర్చిస్తారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలపై అమ్మకం పన్ను తగ్గించడం సాధ్యం కాకపోవచ్చునని ఆయన అన్నారు. తప్పనిసరి స్థితిలోనే కేంద్రం పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచిందని ఆయన చెప్పారు.

పెట్రో ఉత్పత్తుల ధరలను రాజకీయం చేయవద్దని ఆయన పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ముడి చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో విపరీతంగా పెరిగాయని, దీంతో పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచాల్సి వచ్చిందని ఆయన వివరించారు. పెట్రో ఉత్పత్తుల ధరల పెంపుతో రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నించవద్దని, ప్రభుత్వంతో సహకరించాలని ఆయన రాజకీయ పార్టీలను కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+