రామోజీ మార్గదర్శి వేరు: ఉండవల్లి
{image-ramoji rao_06062008.jpg telugu.oneindia.com}హైదరాబాద్: ఈనాడు దినపత్రిక అధిపతి రామోజీరావు ఆధ్వర్యంలోని మార్గదర్శి ఫైనాన్షియర్స్ కు సహారాకు మధ్య చాలా తేడా ఉందని రాజమండ్రి కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. మార్గదర్శి లోపాలను బయటపెట్టడం వల్లనే రిజర్వ్ బ్యాంకు సహారా డిపాజిట్ల సేకరణను నిలిపేసిందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. మార్గదర్శి పైనాన్షియర్స్ విషయంలో రిజర్వ్ బ్యాంకు నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆయన విమర్శించారు.
సహారాలోని లోపాలు చాలా చిన్నవని, మార్గదర్శి వ్యవహారం అటువంటిది కాదని, మార్గదర్శి అక్రమాలను బయట పెట్టే వరకు పోరాటం చేస్తానని ఆయన చెప్పారు. మార్గదర్శి విషయంలో రిజర్వ్ బ్యాంక్ నిర్లక్ష్యాన్ని బయట పెట్టే వరకు విశ్రమించనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications