చీటింగ్ కేసుపై కోడెల సవాల్
గుంటూరు: నాగార్జున రియల్ ఎస్టేట్ సంస్థతో తనకు ఏ విధమైన సంబంధం లేదని మాజీ మంత్రి, తెలుగుదేశం నాయకుడు డాక్టర్ కోడెల శివప్రసాద రావు స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మోసం చేశారంటూ కోడెల శివప్రసాదరావుపై చీటింగ్ కేసు పెట్టారు. తాను ఎవరినీ మోసం చేయలేదని ఆయన సోమవారం స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని, తాను మోసం చేసినట్లు రుజువైతే ఏ శిక్షకైనా సిద్దమేనని, నిరూపించలేకపోతే కాంగ్రెస్ వారు ఏ శిక్షకు సిద్ధపడతారో చెప్పాలని ఆయన అన్నారు.
తనను రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ వారు తనపై బురద చల్లుతున్నారని ఆయన అన్నారు. నాగార్జున రియల్ ఎస్టేట్ సంస్థతో సంబంధం లేదని చెప్పడానికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తన వద్ద ఉందని, హైకోర్టులో కూడా తనకు సంబంధం లేదని తేలిందని, కన్స్యూమర్ ఫోరం కూడా తనకు సంబంధం లేదని తేల్చిందని, ఈ డాక్యుమెంట్లన్నీ తన వద్ద ఉన్నాయని ఆనయ చెప్పారు.












Click it and Unblock the Notifications
