తెలుగు మహిళ రోజా అరెస్టు
తిరుపతి: బెల్టు షాపులను రద్దు చేయాలని సోమవారం ఆందోళనకు దిగిన తెలుగు మహిళ అధ్యక్షురాలు, సినీ నటి రోజాను పోలీసులు అరెస్టు చేశారు. బెల్టు షాపులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తిరుపతిలోని జీవకోనలో గల ఎక్సైజ్, ప్రహబిషన్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. రాస్తారోకో నిర్వహించారు.
రోజా బెల్టు షాపులను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ప్రభుత్వం మద్యాన్ని ఏరులై పారిస్తోందని రోజా విమర్శించారు. మద్యం ద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకుంటోందని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications
