జైలు నుంచి హసీనా విడుదల

ప్రధానమైన రెండు రాజకీయ పార్టీలు అవామీ లీగ్, బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీలతో ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఏడాది చివరలో దేశంలో ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. రెండు పార్టీల నాయకురాళ్లు షేక్ హసీనా, బిఎన్ పి నేత ఖలిదా జియాలను ప్రభుత్వం అరెస్టు చేసింది. తమ పార్టీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని, ఎన్నికల్లో పాల్గొంటామని అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అష్రాఫుల్ ఇస్లాం చెప్పారు. దేశంలో రాజకీయ అస్థిరత తొలగిపోగలదని ఆయన ఆశించారు. జియాను కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఆమె దేశం విడిచి వెళ్లడానికి సుముఖంగా లేరు.












Click it and Unblock the Notifications