హైదరాబాదులో ఎడ్యుకేషన్ కాంప్లెక్స్
హైదరాబాద్: హైదరాబాదులో ఎడ్యుకేషన్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విద్యపై ముఖ్యమంత్రి బుధవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మరో 6 జిల్లాల్లో విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు ఉన్నత విద్యా మంత్రి ఆర్. చెంగారెడ్డి సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు.
మహబూబ్ నగర్, కరీంనగర్, శ్రీకాకుళం, నెల్లూరు, మచిలీపట్నం, కర్నూలుల్లో ఈ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 19 డిగ్రీ కళాశాలలను, 8 జూనియర్ కళాశాలలను, 8 పాలిటెక్నిక్ కళాశాలలను నెలకొల్పుతామని ఆయన చెప్పారు. జూనియర్ కళాశాలల్లో వేయి, డిగ్రీ కళాశాలల్లో 500, విశ్వవిద్యాలయాల్లో 700 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో పనితీరును బట్టి రిటైర్డ్ అధ్యాపకులను నియమిస్తామని కూడా ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications