సిపిఐ నేత నారాయణ అరెస్టు

K Narayana
ఒంగోలు: ప్రకాశం జిల్లా చినగంజాంలో భూ ఆక్రమణకు దిగిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణను పోలీసులు అరెస్టు చేశారు. నారాయణ అరెస్టును అడ్డుకోవడానికి ప్రయత్నించిన 200 మంది సిపిఐ కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. స్నోవైట్ భూములను అక్రమించి ఎర్రజెండాలు పాతడానికి నారాయణ నాయకత్వంలో సిపిఐ కార్యకర్తలు ప్రయత్నించారు. పోలీసుల కళ్లు గప్పి నారాయణ చినగంజాంలోని స్నోవైట్ భూముల వద్దకు చేరుకున్నారు. ఈ భూములను పేదలకు పంచాలని ఆయన డిమాండ్ చేశారు. పెద్దల చేతుల్లో ఉన్న భూముల ఆక్రమణ పోరాటాన్ని సిపిఐ దీంతో మరోసారి మొదలు పెట్టింది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+