సిబిఎస్ ఇ సిలబస్ పై సత్యాగ్రహం

హైదరాబాద్: పాఠశాలల్లో సిబిఎస్ ఇ సిలబస్ ను ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ టీచర్ల ఎమ్మెల్సీలు గురువారం శాసనసభ ఎదురుగా సత్యాగ్రహానికి దిగారు. చుక్కా రామయ్య, సుధాకర్ రెడ్డి తదితరులు ఈ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. సిబిఎస్ ఇ సిలబస్ పాఠశాలల్లో ప్రవేశపెట్టడాన్ని ఉపాధ్యా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వం దిగి వచ్చి సిబిఎస్ ఇ సిలబస్ ను ప్రవేశపెడుతూ జారీ చేసిన జీవోను ఉపసంహరించుకునే వరకు సత్యాగ్రహం సాగుతుందని చుక్కా రామయ్య చెప్పారు.

తమ ఉద్యమం గ్రామగ్రామానికి పాకుతుందని ఆయన చెప్పారు. విద్యావ్యవస్థను ఛిన్నాభిన్నం చేయవద్దని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. సిబిఎస్ ఇ సిలబస్ ను ఉపసంహరించుకునేది లేదని పాఠశాల విద్యా మంత్రి దామోదరం రాజనర్సింహ చెప్పారు. ఎమ్మెల్సీలు సత్యాగ్రహాన్ని విరమించుకోవాలని ఆయన కోరారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే సిబిఎస్ ఇ సిలబస్ ను ప్రవేశపెట్టామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+