దశావతారం విడుదలకు గ్రీన్ సిగ్నల్
{image-kamal hassan_12062008.jpg telugu.oneindia.com}న్యూఢిల్లీ: కమలహాసన్ నటించిన దశావతరం సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. సినిమా విడుదలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా విడుదలపై స్టేకు పెట్టుకున్న దరఖాస్తును సుప్రీంకోర్టు ఉపసంహరించుకుంది. భక్తవత్సలం, స్వామి అనే ఇద్దరు సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఈ సినిమాలో శైవులకు, వైష్ణవులకు సంబంధించి దృశ్యాలు కొన్ని ఉన్నాయి. ఈ సినిమాలో వైష్ణవులను కించపరిచే సన్నివేశం ఉందని అభ్యంతరం తెలిపుతూ వారు కేసు వేశారు. మత విశ్వాసాలను కించపరిచే విధంగా లేవని అభిప్రాయపడుతూ గతంలో హైకోర్టు సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రేపు (శుక్రవారం) విడుదల కానుంది.
తమిళ సినిమాలోని కొందరు ప్రముఖుల కోసం దశావతరం సినిమాను చెన్నైలో ప్రదర్శించారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ప్రత్యేక ఆహ్వానితుల్లో ఉన్నారు. సినిమా అద్భుతమని రజనీకాంత్ ప్రశంసించారు. రజనీ, కమల్ ల గురువు కె. బాలచందర్ కూడా ఈ సినిమాను చూశారు. సినిమా చూసిన తెల్లారే తన ఆనందాన్ని ఆపుకోలేక బాలచందర్ కమల్, రవికుమార్ ల ఇళ్లకు వెళ్లి వారిని అభినందించారు.












Click it and Unblock the Notifications
