తమ్ముళ్లకు బాబు హెచ్చరిక

Chandrababu Naidu
విశాఖపట్నం: ఐదుగురు సభ్యుల కమిటీ నిర్ణయం తీసుకునే వరకు తెలంగాణపై ఎవరూ బహిరంగ ప్రకటనలు చేయవద్దని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు హెచ్చరించారు. తెలంగాణపై మాట్లాడితే చర్యలు తీసుకుంటే చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణ అంశం చాలా సున్నితమైందని, కమిటీ పరిశీలిస్తుందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. పార్టీ ఉపాధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యవహారంపై కూడా మాట్లాడవద్దని ఆయన పార్టీ నాయకులను హెచ్చరించారు.

కోస్టల్ కారిడార్ పేరుతో ఎవరైనా మీ భూముల కోసం వస్తే ఇంట్లో కట్టిపడేయండని, ఎవరేం చేస్తారో చూద్దామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రజలతో అన్నారు. చంద్రబాబు మీ కోసం చైతన్య యాత్ర శుక్రవారం విశాఖపట్నం జిల్లాలో సాగింది. పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. పేదరికాన్ని రూపుమాపడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు.

తమ తొమ్మిదేళ్ల పాలనలో బ్లాక్ మార్కెట్ లేకుండా చూశామని ఆయన చెప్పారు. రైతుల రుణాలు మాఫీ అయ్యే వరకు పోరాటం చేస్తానని ఆయన చెప్పారు. తుది శ్వాస వరకు ప్రజలకోసం పని చేస్తానని ఆయన చెప్పారు. వృద్దులకు 500 రూపాయల పింఛను ఇస్తామని ఆయన చెప్పారు. పాయకరావుపేటలో ఆయన ప్రసంగించారు. వాల్తేరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+