తెలంగాణపై చర్చ జరగాలి: కోడెల
గుంటూరు: తెలంగాణపై విస్తృత స్థాయి చర్చ జరగాల్సి ఉందని తెలుగుదేశం పార్టీ నాయకుడు డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. పార్టీలో తెలంగాణవాదం వల్ల నష్టమేమీ లేదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణవాదంపై ఎవరూ పార్టీని వీడిపోరని ఆయన అన్నారు. తెలంగాణపై విస్తృత స్థాయి వేదిక మీద చర్చ జరగాల్సి ఉందని ఆయన అన్నారు.
తెలంగాణవాదం బలంగా ఉంటే ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఎందుకు ఓటు వేశారని, కాంగ్రెసుకు ఎందుకు వేశారని, తెలంగాణవాదం బలంగా ఉంటే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి గుండు గుత్తగా ఓట్లు పడాల్సి వుండిందని, కానీ అలా జరగలేదని ఆయన అన్నారు. ఓట్ల పోలింగును బట్టి ప్రజల్లో మిశ్రమ స్పందన ఉందని అర్థమవుతోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
