దేవేందర్ తో ఎర్రబెల్లి దయాకర్ భేటీ
హైదరాబాద్: తెలంగాణవాదం వినిపిస్తున్న తెలుగుదేశం నాయకుడు టి. దేవేందర్ గౌడ్ ను శుక్రవారంనాడు పార్టీ పార్లమెంటు సభ్యుడు ఎర్రబెల్లి దయాకరరావు కలిశారు. వారిద్దరి మధ్య తెలంగాణవాదంపై చర్చ జరిగినట్లు సమాచారం. అలాగే గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చేపట్టే ఉద్యమంపై కూడా వారిద్దరి మధ్య చర్చ జరిగింది.
పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వద్ద తెలంగాణవాదాన్ని గట్టిగా వినిపించిన దేవేందర్ గౌడ్ ను గురువారంనాడు గుత్తా సుఖేందర్ రెడ్డి కలిశారు. అప్పటి నుంచి తెలంగాణవాదంపై తెలంగాణ నాయకులు నిరంతరంగా ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఈనెల 18వ తేదీన తెలంగాణపై వేసిన కమిటీ సమావేశం జరుగుతుందని, ఈ సమావేశంలో కమిటీ విధివిధానాలను ఖరారు చేస్తామని తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications
