కోడెలపై కేసు తెలియదు: కాసు

Kasu Krishna Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నాయకుడు కోడెల శివప్రసాదరావుపై పోలీసులు కేసు పెట్టిన విషయం తనకు తెలియదని రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి అన్నారు. నర్సారావుపేట నియోజకవర్గంలో కోడెల శివప్రసాదరావును ఎవరూ పట్టించుకోవడం లేదని, అందుకే ఇటువంటి జిమ్మిక్కులకు పాల్పడుతున్నారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

కోడెల శివప్రసాదరావుపై కేసు విషయంలో అధికారులెవరూ తనతో మాట్లాడలేదని, అందరికి తెలిసినట్లుగా కోడెల శివప్రసాదరావు విషయం తనకు తెలిసిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడేది కాదని ఆయన అన్నారు. కోడెల శివప్రసాదరావుపై ఏడు కేసులున్నాయని, తాము ఏనాడు పట్టించుకోలేదని, చట్టం తన పని తాను చేసుకు పోతుందనే ఉద్దేశంతో ఉన్నామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+