ఎవరూ బయటకు వెళ్లరు: తలసాని
తిరుపతి: తమ పార్టీలో తెలంగాణకు సమైక్యావాదులు ఇంకా కొంత మంది ఉన్నారని తెలుగుదేశం శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస యాదవ్ చెప్పారు. ఆయన శుక్రవారంనాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సమైక్యవాదంపై తన అభిప్రాయం పూర్తిగా వ్యక్తిగతమని, ఇందులో ఎవరి ప్రోద్బలం లేదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణవాదం వినిపించేవారెవరూ పార్టీని వదిలిపెట్టి పోరని ఆయన అన్నారు. అలాంటి పరిస్థితి వస్తే పార్టీ చూసుకుంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
