మాట మార్చడం సరి కాదు: ముత్యం
హైదరాబాద్: తెలంగాణపై మాట మార్చడం సరి కాదని తెలుగుదేశం పార్టీ నాయకుడు ముత్యంరెడ్డి అన్నారు. తెలంగాణపై పార్టీ నాయకులు తలో మాట మాట్లాడడం సరి కాదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణపై ఉప ఎన్నికలకు ముందు ఒక మాట మాట్లాడారని, ఇప్పుడు మరో మాట మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణవాదం లేకుంటే ఆ వాదం వినిపించిన కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకరరావు ఎలా గెలిచారని ఆయన ప్రశ్నించారు.
బహిరంగ ప్రకటనలు చేసిన తమ పార్టీ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస యాదవ్ పై చర్య తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణపై కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి మోసం చేశాయని, తాము చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. తెలంగాణ ఇస్తామని కాంగ్రెసువారు, తెస్తామని తెరాసవారు చెప్పారని, అయితే ఆ పార్టీలు ప్రజలను మోసం చేశాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
