చిరు పార్టీపై మాట్లాడ: ఉండవల్లి
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి స్వయంగా తన పార్టీ గురించి ప్రకటించే వరకు తాను మాట్లాడబోనని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. చిరంజీవి అధికారికంగా ప్రకటించినప్పుడు మాట్లాడుతానని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు స్పష్టత లేదని, అసలు ఆంధ్రప్రదేశ్ మీదనే చంద్రబాబుకు స్పష్టత లేదని ఆయన అన్నారు. చంద్రబాబుపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణపై కాంగ్రెసుకు పార్టీకి స్పష్టత ఉందని, తెలంగాణ సెంటిమెంటు ఉందని మొదట గుర్తించిన పార్టీ కాంగ్రెసేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
