తెలంగాణకు వ్యతిరేకం కాదు: బాబు

Chandrababu Naidu
విశాఖపట్నం: తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మరోసారి స్పష్టం చేశారు. చంద్రబాబు మీ కోసం చైతన్యయాత్ర సోమవారం విశాఖపట్నం జిల్లాలో సాగింది. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ సమస్యను కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) జఠిలం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజల్లో తమపై విశ్వసనీయత పెరిగిందని, ఇటీవలి ఉప ఎన్నికల ఫలితాలే అందుకే నిదర్శనమని ఆయన అన్నారు. తాము తెలంగాణపై వేసిన కమిటీ నెలరోజుల్లో నివేదిక సమర్పిస్తుందని ఆయన చెప్పారు.

తెలంగాణపై నాయకులకు, కార్యకర్తలకు సూచనలు చేశామని, తెలంగాణ విషయంలో పార్టీకి నష్టం కలిగించే విధంగా మాట్లాడితే చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. తన మీకోసం యాత్రకు విశేష స్పందన లభిస్తోందని, వచ్చే ఎన్నికల్లో తాము గెలిచి తిరిగి అధికారంలోకి వస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెసు పాలనతో ప్రజలు విసిగిపోయారని, ప్రజలు తమకే పట్టం కడతారని ఆయన అన్నారు. పేదలకు మేలు చేయడమే తమ లక్ష్యమని, వారి ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

మంత్రులు, కాంగ్రెసు శాసనసభ్యులు అవినీతికి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. విశాఖపట్నం జిల్లాలో కాంగ్రెస్ శాసనసభ్యులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. అక్రమంగా భూములు ఆక్రమిస్తున్నారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+