విజయనగరం జిల్లాలో టిడిపి కమిటీ
హైదరాబాద్: తెలంగాణపై వేసిన తెలుగుదేశం కమిటీ ఈ నెల 18వ తేదీన విజయనగరం జిల్లా దేవులపల్లిలో జరుగుతుంది. ఐదుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీ సమావేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ మేరకు కమిటీ సభ్యులకు చంద్రబాబు సమాచారం అందించారు. ప్రస్తుతం చంద్రబాబు విశాఖపట్నం జిల్లాలో మీ కోసం యాత్ర నిర్వహిస్తున్నారు.
సమావేశానికి సంబంధించిన సమాచారం చంద్రబాబు అందజేసినట్లు తెలుగుదేశం పార్టీ నాయకుడు టి. దేవేందర్ గౌడ్ చెప్పారు. సమస్య తీవ్రత దృష్ట్యా చంద్రబాబే ఈ సమావేశానికి నేతృత్వం వహించాలని అనుకుని ఉంటారని ఆయన అన్నారు. తాను అక్కడికి వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణపై నాయకులు బహిరంగ ప్రకటనలు చేయడం మంచిది కాదని తెలుగుదేశం పార్టీ నాయకుడు కె.ఇ. కృష్ణమూర్తి కర్నూలులో అన్నారు. తెలంగాణ సమస్య ఒక సమావేశంతో తీరేది కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
