కాంగ్రెసును వీడను: ఉప్పునూతల

తాను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి అనుకూలంగా మాట్లాడలేదని, తెలంగాణ సెంటిమెంటు ఉందని మాత్రమే మాట్లాడానని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి డాక్టరా వైయస్ రాజశేఖర రెడ్డి కూడా తెలంగాణ సెంటిమెంటు ఉందని అంగీకరించారని ఆయన చెప్పారు. ఆలేరు నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి లాజరస్ ఓటమి తాను కారణం కాదని, ముఖ్యమంత్రికి ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయన అన్నారు. తెలంగాణ విషయంలో ఎవరి అభిప్రాయాలు వారు చెబుతున్నారని, సమైకాంధ్ర అంటేనేమో తప్పు లేదు గానీ తెలంగాణ రాష్ట్రం కావాలంటే ద్రోహమా అని ఆయన ప్రశ్నించారు. తాను చెడుగా గానీ, మంచిగా గానీ ముఖ్యమంత్రికి గానీ, పిసిసి అధ్యక్షుడికి గానీ చెప్పలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
