న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి 36 లోక్ సభ స్ధానాలు, 230 అసెంబ్లీ స్ధానాలు వస్తాయని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గురువారం ఇక్క డ మీడియా ప్రతినిధుల ముందు చెప్పారు. కొత్త పార్టీలు ఎన్ని వచ్చినా వాటి ప్రభావం కాంగ్రెస్ పార్టీ మీద ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. "ఈనాడు", "ఆంధ్రజ్యోతి" పత్రికల మీద ముఖ్యమంత్రి మరోసారి విరుచుకుపడ్డారు. ఆ రెండు పత్రికలు పనిగట్టుకుని ప్రభుత్వ వ్యతిరేక వార్తలను ప్రచురిస్తున్నాయని ఆయన ఆరోపించారు.