ఎట్టిపరిస్థితుల్లోను పార్టీని విడిచి పెట్టను:దేవేందర్ గౌడ్

ఈ పరిణామంతో ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనని పార్టీ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దేవేందర్ గౌడ్ తన ఇంటివద్ద కొందరు సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ఈ బేఠీ వివరాలను బయటకు పొక్కకుండా గోప్యంగా ఉంచారు. మీడియాతో మాట్లాడేందుకు ఇష్టపడని దేవేందర్ పోన్ ద్వారా సీనియర్లతో మంతనాలు జరిపినట్లు సమాచారం. దాంతోపాటు మరికొందరు నేతలు ఆయన్ను రహస్యంగా కలుసుకున్నట్లకూడా సమాచారం. తెలంగాణ వాదాన్ని బలంగా వినిపిస్తూ పార్టీలోనే కొనసాగాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ప్రత్యేకవాదంపై అధిష్టానాన్ని ఒప్పించగలననే నమ్మకంతో దేవేందర్ గౌడ్ ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications
