నకిలీ నోట్ల ముఠా పట్టివేత
హైదరాబాద్: హైదరాబాద్ టాస్క్ ఫోర్సు పోలీసులు నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. ముఠాలోని ఇద్దరు సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సత్యనారాయణరెడ్డి, కామేశ్వరరావు అనే ఇద్దరు వ్యక్తులు నకిలీ కరెన్సీని చెలామణి చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాకు పాకిస్థాన్ ఐఎస్ ఐతో సంబంధాలు ఉండవచ్చుననే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నకిలీ కరెన్సీని సత్యనారాయణ రెడ్డి, కామేశ్వరరావు షౌకత్ అలీ నుంచి నకిలీ నోట్లను కొనుగోలు చేస్తున్నారు. షౌకత్ అలీ పశ్చిమ బెంగాల్ కు చెందిన ఇద్దరు వ్యక్తులనుంచి నకిలీ నోట్లను తెచ్చి యానాంలో సత్యనారాయణ రెడ్డికి, కామేశ్వరరావుకు అందజేసేవాడు. ఈ నకిలీ కరెన్సీ బంగ్లాదేశ్ నుంచి దేశంలోకి ప్రవేశిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నోట్లు పాకిస్థాన్ లో తయారై ఉండవచ్చునని భావిస్తున్నారు. అరెస్టయిన వారి నుంచి 36 లక్షల నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications
