శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు
హైదరాబాద్: ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్ కు, ఇద్దరు జర్నలిస్టులకు సికింద్రాబాద్ 11వ మెజిస్ట్రేట్ గురువారం సాయంత్రం బెయిల్ మంజూరు చేశారు. వారికి షరతులతో కూడిన బెయిల్ ను మెజిస్ట్రేట్ మంజూరు చేశారు. పది వేల రూపాయలేసి పూచీకత్తుతో బెయిల్ మంజూరైంది.
ఆంధ్రజ్యోతి సిబ్బందికి బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్ పై గురువారం ఉదయం విచారణ ప్రారంభమైంది. విచారణ మూడు సార్లు వాయిదా పడింది. చివరగా కోర్టు తన తీర్పును సాయంత్రం నాలుగు గంటలకు ప్రకటిస్తానని చెప్పారు. ఆ మేరకు మెజిస్ట్రేట్ తన నిర్ణయాన్ని వెల్లడించారు.












Click it and Unblock the Notifications