హత్య కేసులో ఐదుగురి అరెస్టు
వరంగల్: వరంగల్ లో వ్యాపారి విజయపాల్ హత్యకేసులో పోలీసులు ఒక మహిళ సహా ఐదుగురిని అరెస్టు చేశారు. హత్య వెనక పని మనిషి ఉమతో పాటు శ్రీనివాస్, మురారి తదితరులు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. విజయపాల్ ను హత్య చేసి ఇంట్లో నుంచి నగదును, నగలును దోచుకెళ్లినట్లు వరంగల్ జిల్లా ఎస్పీ సజ్జనార్ చెప్పారు. వారి నుంచి రెండు లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయల విలువ చేసే బంగారం, వెండి నగలును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications