లాకప్ డెత్: రిటైర్డ్ ఎస్సైకి జీవిత ఖైదు
అనంతపురం: ఒక లాకప్ డెత్ కేసులో రిటైర్డ్ సబ్ ఇన్సెక్టర్ నిస్సార్ అహ్మద్ కు అనంతపురం జిల్లా హిందూపురం కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ మేరకు హిందూపురం కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. 1995లో వెంకటేష్ అనే కర్ణాటకకు చెందిన వ్యక్తి మృతిపై నిస్సార్ అహ్మద్ పై కేసు నమోదైంది.
వెంకటేష్ ను దొంగతనం కేసులో నిస్సార్ అహ్మద్ తీసుకొచ్చి చితకబాదాడు. దీంతో వెంకటేష్ మరణించాడు. దీంతో నిస్సార్ అహ్మద్ పై కేసు నడిచింది. హిందీ కోర్టు తీర్పుపై పై కోర్టుకు వెళ్తానని నిస్సార్ అహ్మద్ చెప్పారు. నిస్సార్ అహ్మద్ వివిధ ప్రాంతాల్లో ఎస్సైగా, ఎఎస్సైగా పని చేశారు.












Click it and Unblock the Notifications