పాల్ స్కూల్ పై బాలిక ఫిర్యాదు
హైదరాబాద్: క్రైస్తవ మతప్రచారకుడు కె.ఎ. పాల్ మెదక్ జిల్లాలో నిర్వహిస్తున్న పాఠశాలపై మమత అనే బాలిక సోమవారం మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ పాఠశాలలో ఆ బాలిక పదో తరగతి పాసయింది. తనకు ట్రాన్సఫర్ సర్టిఫికెట్ (టీసీ) ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆ బాలిక ఫిర్యాదు చేసింది. టీసీ ఇస్తే విదేశీ విరాళాలు ఆగిపోతాయని చెబుతున్నారని ఆమె చెప్పింది.
బాలిక ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని మానవ హక్కుల సంఘం పాఠశాలకు నోటీసులు జారీ చేసింది. ప్రజాశాంతి పార్టీని స్థాపించి కె.ఎ. పాల్ వివిధ పార్టీల నాయకులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న విషయం తెలిసిందే. కె.ఎ. పాల్ కు సంబంధించిన విదేశీ విరాళాలపై గతంలో ఆయన సోదరుడు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications