రోజులు దగ్గరపడ్డాయి: నారాయణ
విశాఖపట్నం: వామపక్షాలవి దివాళాకోరు విధానాలని కాంగ్రెసు చేసిన విమర్శలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెసుకు రోజులు దగ్గరపడ్డాయని, అందుకే ఆ విధంగా మాట్లాడుతోందని ఆయన అన్నారు. అణు ఒప్పందానికి బిజెపి వ్యతిరేకమేమీ కాదని, తాము అధికారంలోకి వస్తే పునసమీక్షిస్తామని మాత్రమే అంటోందని ఆయన అన్నారు.
తాము చేసుకోవాల్సిన అణు ఒప్పందాన్ని కాంగ్రెసు ఎలా చేసుకుంటుందోనేదే బిజెపి అభ్యంతరమని, అందుకే బిజెపి యుపిఎ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తోందని ఆయన అన్నారు. తాము విధానపరంగా అణు ఒప్పందాన్ని వ్యతిరేస్తున్నామని, విధానాల్లోనే తేడా ఉందని, అందువల్ల ప్రభుత్వాన్ని వ్యతిరేకించడంలో బిజెపికి, తమకు మధ్య పోలిక లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
