ఎవరికి చెప్పుకోవాలి: జెసి నిర్వేదం
హైదరాబాద్: రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీఎ) అధికారుల వేధింపులపై తాము కాంగ్రెసులో ఉండి కూడా ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి చెప్పుకోలేని స్థితి ఏర్పడిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జెసి దివాకర్ రెడ్డి అన్నారు. తాము ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియడం లేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఆర్టీఎ అధికారులు దివాకర్ ట్రావెల్స్ కు చెందిన బస్సును సీజ్ చేయడంపై మంత్రి సోదరుడు జెసి ప్రభాకర్ రెడ్డి ఆర్టీఎ కార్యాలయం వద్ద ధర్నాకు దిగిన విషయం తెలిసిందే.
మంత్రివై ఉండి ఏం ఉపయోగమని తన తమ్ముడు జెసి ప్రభాకర్ రెడ్డి తనను నిలదీస్తున్నాడని దివాకర్ రెడ్డి చెప్పారు. తమ ట్రావెల్స్ వ్యవహారాలన్నీ 1981 నుంచి తన తమ్ముడే చూస్తున్నాడని ఆయన చెప్పారు. తమ బస్సులన్నీ నిబంధనల మేరకే నడుస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. తప్పులు జరిగితే చర్యలు తీసుకోవడానికి తాము వ్యతిరేకం కాదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications