ఆర్టీఎ ఆఫీసర్లపై జెసి తమ్ముడి వీరంగం
హైదరాబాద్: రాష్ట్ర మంత్రి జెసి దివాకర్ రెడ్డి సోదరుడు జెసి ప్రభాకర్ రెడ్డి సోమవారంనాడు హైదరాబాదులోని ఖైరతాబాదులో గల రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీఎ) కార్యాలయంలో వీరంగం సృష్టించారు. దివాకర్ ట్రావెల్స్ కు చెందిన తమ బస్సులను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఆరోపిస్తూ అధికారులపై విరుచుకుపడ్డారు. ఆర్టీఎ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. దివాకర్ ట్రావెల్స్ పై కేసులు నమోదు చేయడంపై ఆయన మండిపడ్డారు.
తమపై అక్రమంగా కేసులు బనాయించారని ఆయన విమర్శించారు. తాము సక్రమంగానే పన్నులు చెల్లిస్తున్నామని ఆయన చెప్పారు. ఆర్టీఎ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తమ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. తాము నిబంధనలను ఉల్లంఘించడం లేదని ఆయన అన్నారు. జెసి ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు ఆర్టీఎ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. అక్రమంగా తిరుగుతున్న దివాకర్ ట్రావెల్స్ కు చెందిన ఒక బస్సును ఆర్టీఎ అధికారులు సీజ్ చేశారు.












Click it and Unblock the Notifications