అల్పపీడనంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు
హైదరాబాద్ : దక్షిణ ఒరిస్సా, ఉత్తరాంధ్ర తీరాల సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మంగళవారం మరింత బలపడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం ప్రభావం చేత రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 48 గంటల్లో కోస్తా, తెలంగాణ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
సోమవారం ఉదయం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నూజివీడులో 9 సెం.మీ, చీపురుపల్లి, మధిమ, ఖమ్మం పట్టణాలలో 8 సెం.మీ, ఏలూరులో 7, అమలాపురం, సంగారెడ్డి, భీమవరం, అరకులోయల్లో 6, కర్నూలు, హకీంపేట, రేపల్లె, గుడివాడ, భీమవరం ప్రాంతాల్లో 5 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదు అయ్యింది












Click it and Unblock the Notifications
