టిడిపి కోర్ కమిటీ మీట్ నేడే

T Devendra Goud
మహబూబ్ నగర్: తెలుగుదేశం పార్టీ కోర్ కమిటీ సమావేశం గురువారం మహబూబ్ నగర్ జిల్లా ఐజలో జరగనుంది. తెలంగాణపై వేసిన ఐదుగురు సభ్యుల కమిటీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సమక్షంలో సమావేశం కానుంది. ఈ కమిటీలో ఉన్న టి. దేవేందర్ గౌడ్ పార్టీకి రాజీనామా చేసి నవ తెలంగాణ ప్రజా పార్టీని ఏర్పాటు చేశారు. దీంతో ఆయన స్థానంలో వరంగల్ పార్లమెంటు సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావును కమిటీలోకి తీసుకున్నారు. చంద్రబాబు మీ కోసం యాత్ర మహబూబ్ నగర్ జిల్లాలో సాగుతోంది. ఈ పరిస్థితిలో కోర్ కమిటీ సమావేశం ఐజాలో జరుగుతోంది.

ఈ కమిటీ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర రాజకీయాలపై విస్తృత చర్చ జరుగుతుందని పార్టీ నాయకుడు యనమల రామకృష్ణుడు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయని విస్తృతంగా వార్తలు వస్తున్నాయి. చంద్రబాబుతో తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు పలు మార్లు మాట్లాడారు. ఈ నేపథ్యంలో తెలంగాణపై కోర్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందనే ప్రచారం కూడా జరిగింది. అయితే, మరో రెండు, మూడు సమావేశాల తర్వాత గానీ తెలంగాణపై పార్టీ కోర్ కమిటీ నిర్ణయం తీసుకునే అవకాశం లేదని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+